3డిలో షూట్ చేయనున్న రజినీ ‘రోబో-2’

3డిలో షూట్ చేయనున్న రజినీ ‘రోబో-2’

Published on Sep 24, 2015 8:00 PM IST

shankar_rajinikanth
స్వతహాగా తమిళ వాడైనా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రజినీకాంత్. ఆయన సినిమాలు అన్నీ సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవుతుంటాయి. అలాంటి సూపర్ స్టార్ రజినీ భారీ బడ్జెట్ మరియు గ్రాండ్ విజువల్స్ తో శంకర్ డైరెక్షన లో చేసి అందరి మెప్పును పొంది బాక్స్ ఆఫీసుని షేక్ చేసిన సినిమా ‘రోబో’. గత కొద్ది రోజులుగా ‘రోబో 2’ కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ కి రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమాని ప్రారంభించడానికి ప్లాన్ చేసారని ఇదివరకే తెలియజేశాం.

మాకు తాజాగా ఈ సినిమా గురించిన ఓ ప్రత్యేక కథనం తెలిసింది. సుమారు 200 కోట్లకి పై బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని 3డి పార్మాట్ లో కూడా తెరకెక్కించడానికి శంకర్ శ్రీకారం చుట్టాడని సమాచారం. ఒకేసారి 2డి మరియు 3డి ఫార్మాట్స్ లో షూట్ చేయనున్నారు. రోబో 2 కథ కోసం శంకర్ మొదటిసారి మలయాళ ఫేమస్ నవలా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ బి. జేయమోహన్ తో కలిసి వర్క్ చేసాడు. ప్రస్తుతం శంకర్ తన టెక్నికల్ టీం మరియు విజువల్ ఎఫెక్ట్స్ టీంతో చర్చలు జరుపుతున్నాడు. డిసెంబర్ 12న ప్రారంభించి అదే నెలలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే మిగిలిన నటీనటుల్ని కూడా ఫైనలైజ్ చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు