
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం మాఫియా డాన్ గా చేస్తున్న ‘కబాలి’. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన ‘రోబో 2’ని మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాని తన పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న గ్రాండ్ గా లాంచ్ చేయాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెన్నై మీడియా వర్గాలు చెబుతున్నాయి.
దానికి ప్రధాన కారణం, చెన్నైని అతలా కుతలం చేసిన వరదలే.. ప్రస్తుతం చెన్నై ప్రజలు అకాల వర్షాల వల్ల వచ్చిన వరదల వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దాంతో రజినీ తన నెక్స్ట్ మూవీ లాంచ్ ని వాయిదా వేసారు. ఇటీవలే రజినీకాంత్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ ని కూడా నిలిపి వేసారు. ఇప్పుడేమో సినిమా లాంచ్ ఆపేశారు. మరో నెల రోజులలోపు సరికొత్త ముహూర్తాన్ని సెట్ చేసి రోబో సీక్వెల్ ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.