ధనుష్ – నాగార్జున మూవీకి మ్యూజిక్ అందించనున్న రాక్ స్టార్

ధనుష్ – నాగార్జున మూవీకి మ్యూజిక్ అందించనున్న రాక్ స్టార్

Published on Jan 20, 2024 7:41 PM IST


కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ నటించిన లేటెస్ట్ కెప్టెన్ మిల్లర్ మూవీ ఇప్పటికే తమిళ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ తో కొనసాగుతోంది. జనవరి 25న తెలుగులో రిలీజ్ కానుంది. ఇక తాజాగా మన తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో ఒక భారీ మూవీ మొదలెట్టారు ధనుష్.

ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర చేస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ లోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ని ఆహ్వానిస్తూ కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషయల్ గా పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. అన్నివర్గాల ఆడియన్స్ ని అలరించేలా అద్భుతంగా రూపొందుతున్న ఈ ప్రాజక్ట్ పై తెలుగు, తమిళ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు