ఫైనల్ షూట్ కు రాకీ భాయ్ ల్యాండయ్యాడు.!

Published on Nov 26, 2020 1:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. దీనికి ముందు వచ్చిన చాప్టర్ 1 అన్ని దేశ వ్యాప్తంగా కూడా ఎంతటి సెన్సేషన్ ను సృష్టించిందో తెలిసిందే. దీనితో సీక్వెల్ పై ఇండియన్ వైడ్ కానీ వినీ ఎరుగని స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా లాక్ డౌన్ లోనే చాలా గ్యాప్ అనంతరం తిరిగి షూట్ ను స్టార్ట్ చేసేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మళ్ళీ స్వల్ప విరామం అనంతం ఫైనల్ షూట్ కు సన్నద్ధం అయ్యారు. మన దగ్గర హైదరాబాద్ లోని షూట్ నిమిత్తం డైనమిక్ హీరో యష్ ఈరోజు ల్యాండ్ అయ్యాడు.

దీనితో ఈ చిత్రం మరో సారి జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుంది. ఇక అలాగే ఈరోజు నుంచే రెగ్యులర్ షూట్ కూడా ఉండనుంది అని ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుండగా హోంబేల్ ఫిల్మ్స్ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More