విజయశాంతిని గుర్తుకు తెచ్చిన రోహిణి !

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి విజయశాంతే ఎంట్రీ ఇచ్చిందా? అనేంతగా బుల్లితెర నటి రోహిణి సందడి చేసింది. ఈ క్రమంలో ఆగస్టు 29న ‘స్పెషల్‌ ట్రిబ్యూట్‌ టు విజయశాంతి’ పేరుతో ప్రసారమైన ప్రత్యేక ఎపిసోడ్‌ లో రోహిణి అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. రోహిణి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ముఖ్యంగా ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘ప్రతి ఘటన’ ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా విజయశాంతి నటించిన ఐదు సినిమాలలో విజయశాంతి పాత్రలను ఎంపిక చేసుకుని, రోహిణి తనదైన శైలిలో విజయశాంతిలా కనిపించి బాగా ఆకట్టుకుంది. రోహిణి హావభావాలు విజయశాంతిని గుర్తుచేసేలా బాగున్నాయి.

Exit mobile version