డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’. కాగా నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత నెల నుండి గోవాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా గోవా షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది.
ఇక వచ్చే వారంలో చిత్రబృందం తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటు సాంగ్స్ కూడా చిత్రీకరించనున్నారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
ఇక ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


