రొమాంటిక్ థ్రిల్లర్ “డర్టీ హరి” 18న రిలీజ్..!

DirtyHari

రొమాంటిక్ థ్రిల్లర్‌గా ప్రముఖ సీనియర్ నిర్మాత ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం డర్టీ హరి. ఈ నెల 18న ఈ చిత్రం ఎటిటి ఎఫ్ ఎమ్ (ఫ్రెండ్లీ మూవీస్) లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నేడు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ వేడుకలో దర్శకుడు ఎం ఎస్ రాజుతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దర్శకుడు ఎం ఎస్ రాజు మాట్లాడుతూ ట్రైలర్ చూసి ఇదేదో బూతు సినిమా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టేనని అన్నారు. అయితే బూతుకు రొమాన్స్ కు చాలా తేడా ఉందని, కొత్త రకం చిత్రాలను ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారని అందుకే నేను కూడా కొత్తగా చేయాలన్న ప్రయత్నంతోనే ఈ కథను ఎంచుకున్నట్టు తెలిపారు.

అందరికి నచ్చే విధంగా ఈ కథ ఉంటుందని, ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ చాలా కస్టపడి పనిచేసారని అన్నారు. అయితే నేటి యువతరం ఆలోచనలు, ఆచరణల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమా ఇది అని, దీన్ని ఫ్రైడే మూవీస్ అనే ఓటిటి ద్వారా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇందులో మీరు సినిమా చూడాలంటే ఓ మిస్ కాల్ ఇస్తే ఆప్ లింక్ మీకు వస్తుందని, దానిని ఇంస్టాల్ చేసుకుని అందులో కొద్దిగా అమౌంట్ పే చేస్తే సినిమా మొత్తం మీ ఇంట్లోనే హాయిగా చూడవచ్చు అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో హీరో ‘హరి’గా హైదరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డి పరిచయం అవుతుండగా, జాక్వెలిన్, వసుధ పాత్రల్లో హీరోయిన్లుగా సిమ్రత్ కౌర్ మరియు రుహాణి శర్మ కనిపించనున్నారు.

Exit mobile version