
రోమియో – పూరి రాసిన ప్రేమకథ సినిమా చూడండి. మీ అభిమాన దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలసి భోజనం చేసే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోండి. అని అంటున్నారు దర్శకనిర్మాత మధుర శ్రీధర్. పూరి సోదరుడు సాయి రామ్ శంకర్, అడోనిక జంటగా గోపి గణేష్ దర్శకత్వంలో దొరైస్వామి నిర్మించిన ‘రోమియో’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. మధుర శ్రీధర్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించారు. ‘రోమియో’ విజయవంతం అయిన సందర్భంగా ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ వివరాలు వెల్లడించడానికి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులతో పాటు పూరి జగన్నాధ్ పాల్గొన్నారు.
అనంతరం మధుర శ్రీధర్ మాట్లాడుతూ… సినిమా చూసిన పూరి అభిమానులు బాగుందని ప్రశంసిస్తున్నారు. వారికొక లక్కీ ఛాన్స్ కల్పిస్తున్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సేల్ఫీ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. మీకు దగ్గరలో థియేటర్ కు వెళ్లి సినిమా చూసి ‘రోమియో’ సినిమా పోస్టర్ తో ఒక సేల్ఫీ ఫోటో దిగి పూరి జగన్నాధ్ మెయిల్ కు పంపించండి. క్రియేటివ్ సేల్ఫీలను సెలెక్ట్ చేసి వారికి పూరి జగన్నాధ్ గారితో భోజనం చేసే అవకాశం కల్పిస్తాం.
సాయి రామ్ శంకర్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా ఇది. మాస్ సెంటర్లలో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. రిలీజ్ వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం ప్రతి నిర్మాతకు ఒక పరీక్ష లాంటిది. మేము ఆ పరీక్షలో గట్టేక్కాం. ఈ రోజు కలెక్షన్స్ బాగున్నాయి. వచ్చే శుక్రవారం నుండి నైజాంలో థియేటర్ లను పెంచుతున్నాం. అలాగే ఆ రోజు కలెక్షన్స్ ను విశాఖ తుఫాన్ భాదితులకు విరాళంగా ఇస్తున్నాం అని తెలిపారు.
పూరి జగన్నాధ్ మాట్లాడుతూ…. కొత్త కథ రాయాలని వచ్చిన ఆలోచనలో నుండి పుట్టిన కథ ‘రోమియో’. రెండు క్యారెక్టర్ లతో రెండు గంటల పాటు సాగే సినిమా. అతి తక్కువ నిర్మాణ వ్యయంతో, కేవలం 16 మంది టెక్నీషియన్లతో తీసిన సినిమా ఇది. చూసిన వారు బాగుందని మెసేజ్, మెయిల్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సినిమాటోగ్రాఫర్ పిజి విందా, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ లతో త్వరలో ఓ కొత్త సినిమా ప్రారంభిస్తా. అని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్, లో బడ్జెట్ సినిమాలు సక్సెస్ సాధిస్తాయి. అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సాయి రామ్ శంకర్, దర్శకుడు గోపి గణేష్, పిజి విందా, సునీల్ కశ్యప్ లు పాల్గొన్నారు.