కోటి రూపాయల లాటరీ కథతో ‘రూపాయనమ:’.. సెన్సార్ పూర్తి, అక్టోబర్ 2న రిలీజ్

కోటి రూపాయల లాటరీ కథతో ‘రూపాయనమ:’.. సెన్సార్ పూర్తి, అక్టోబర్ 2న రిలీజ్

Published on Sep 15, 2026 4:28 AM IST

Roopayanamaha First Look

అరవింద్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రూపాయనమ:’ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రవేద ప్రొడక్షన్స్ పతాకంపై పావని సాగి ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.

కోటి రూపాయల లాటరీ నేపథ్యంలో ఫ్యామిలీ, కామెడీ, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్ర నిడివి రెండు గంటల 13 నిమిషాలుగా ఉంది.

అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రిషి.ఎం సంగీతం అందించగా, జింక వరుణ్ నాయుడు సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు