సాయంత్రం ‘రోషగాడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ !

సాయంత్రం ‘రోషగాడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ !

Published on Nov 12, 2018 12:32 PM IST

విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం “రోషగాడు”. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హైయేత్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

ఇక ఈ చిత్రంలో విజయ్ ఆంథోని సరసన నివేథా పేతురాజ్ హీరొయిన్ గా నటిస్తుండగా, ఫైట్ మాస్టర్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న “రోషగాడు” ఈ నెల 16వ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాష్య శ్రీ, సంగీతం: విజయ్ ఆంథోని, నిర్మాణం : విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని. కథ-దర్శకత్వం గణేష.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు