అంచనాలు పెంచుతున్న ‘రోషగాడు’ టీజర్ !

అంచనాలు పెంచుతున్న ‘రోషగాడు’ టీజర్ !

Published on Oct 25, 2018 11:19 PM IST

Roshagadu

విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం “రోషగాడు”. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా పై ఒక్కసారిగా అంచనాలను పెంచేస్తోంది.

ఇక ఈ చిత్రంలో విజయ్ ఆంథోని సరసన నివేథా పేతురాజ్ హీరొయిన్ గా నటిస్తుండగా , ఫైట్ మాస్టర్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న “రోషగాడు” దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది‌.

టీజర్ కోసం క్లిక్ చేయండి

తాజా వార్తలు