మన టాలీవుడ్ యువ జెనరేషన్ నుంచి రానున్న కాలంలో ప్రామిసింగ్ హీరోగా మారుతున్న యంగ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక కూడా అని చెప్పొచ్చు. రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “ఛాంపియన్”. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అంతే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని మంచి ఓపెనింగ్స్ కూడా సాధించింది.
ఇలా రెండు రోజుల సక్సెస్ ఫుల్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ 2 రోజుల్లో మంచి నెంబర్ నే రిజిస్టర్ చేసినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఛాంపియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.91 కోట్ల గ్రాస్ ని రాబట్టడం అనేది విశేషం. ఇక ఈ శనివారం, ఆదివారం వసూళ్లు కూడా ఇంతే స్ట్రాంగ్ గా నమోదు అయ్యే ఛాన్స్ కూడా దీనికి ఉంది. సో ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత రాబడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ప్రదీప్ అద్వైతం వర్క్ చేయగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అలాగే స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.


