ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ సమర్పణలో స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘ఛాంపియన్’. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తుండగా రోషన్ హీరోగా నటిస్తున్నాడు. పీరియాడిక్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు.
ఇక ఈ ఛాంపియన్ ట్రైలర్ ఆద్యంతం ఎంగేజింగ్ కంటెంట్‌తో కట్ చేశారు. 1947 సమయంలో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా వీర బైరాన్‌పల్లి నేపథ్యంలో జరిగే ఈ కథలో ఓ అందమైన ప్రేమకథను జోడించి మనకు ఓ ఆసక్తికర కథను చూపెట్టేందుకు రోషన్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. అందాల భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
కాగా, ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రియాంక దత్, జికె మోహన్, జెమిని కిరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


