నారా రోహిత్, విశాక సింగ్ జంటగా మూవీమిల్స్ పతాకంపై ప్రకాష్ రెడ్డి నిర్మించిన సినిమా ‘రౌడీ ఫెలో’. ఈ సినిమా ద్వారా గేయ రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సున్నీ యంఆర్ సంగీతం అందించిన ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ముఖ్య అతిధిగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పల్లె రఘునాధ్ రెడ్డి, రేవంత్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులతో పాటు పరుచూరి వెంకటేశ్వరరావు, సుధీర్ వర్మ, సాయి కార్తీక్ తదితర సినిమా ప్రముఖులు హాజరయ్యారు.
ఆడియో సిడిని నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తొలి సిడిని హీరో నారా రోహిత్ స్వీకరించారు.
అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… నెగిటివ్ టైటిల్ పెట్టి పాజిటివ్ స్టొరీ చూపించారు దర్శకుడు. నారా రోహిత్ నటించిన 7వ సినిమా
ఇది. తప్పకుండా హిట్ అవుతుంది. ఈ సినిమా విజయవంతమై రోహిత్ కు మంచి పేరు, నిర్మాతకు లాభాలు తీసుకురావాలి అని అన్నారు.
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. పెదనాన్న వచ్చిన ప్రతిసారి నా సినిమా హిట్ అవుతుంది. ఖచ్చితంగా ‘రౌడీ ఫెలో’ సినిమా కూడా హిట్ అవుతుంది. సన్నీ చాలా మంచి ఆడియో అందించాడు. నా కెరీర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలలో ఇది బెస్ట్ మ్యూజికల్ ఆల్బం. ‘రౌడీ ఫెలో’ అనే మంచి కథతో నాతో సినిమా చేసినందుకు కృష్ణచైతన్యకు కృతజ్ఞతలు అని అన్నారు.
ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.


