“జాతి రత్నాలు” కోసం వస్తున్న ‘రౌడీ’ రత్నం.!

Published on Mar 6, 2021 4:03 pm IST

రీసెంట్ గా వస్తున్న మీడియం బడ్జెట్ సినిమాల్లో మంచి హైప్ అండ్ బజ్ తెచ్చుకున్న చిత్రాల్లో “జాతి రత్నాలు” కూడా ఒకటి. టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శిలు మరో కీలక పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చిత్రం “జాతి రత్నాలు”.

అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రమోషన్స్ ఓ లెవెల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో లాంచ్ చేయించగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే చిత్ర యూనిట్ మంచి బూస్టప్ ఇవ్వడానికి రౌడీ జాతి రత్నం విజయ్ దేవరకొండ రెడీగా ఉన్నాడు.

దీనికి కూడా ఒక ఫన్నీ అండ్ క్రియేటివ్ పోస్టర్ ను రెడీ చేసి విడుదల చేసారు. రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్నాడు. మొత్తానికి మాత్రం చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సాలిడ్ ఫన్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే మార్చ్ 11 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :