మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు రెండు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో హిస్టారికల్ చిత్రం రణబాలి మొదట విడుదలకి రాబోతుండగా దీని తర్వాత దర్శకుడు రవికిరణ్ కోలాతో రౌడీ జనార్దన అనే మరో సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ కూడా ఉంది.
అయితే ఈ చిత్రాల్లో రీసెంట్ గానే రణబాలి షూటింగ్ ని ముగించుకున్న విజయ్ లేటెస్ట్ గా టోటల్ డబ్బింగ్ ని కూడా పూర్తి చేసేసినట్టు తెలుస్తుంది. సో దీనితో రణబాలి కి తన వర్క్ అంతా ఫినిష్ చేసాడని చెప్పొచ్చు. అలాగే దీని తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంటనే రౌడీ జనార్ధన గా మారిపోతున్నట్టు తెలుస్తుంది.
మళ్ళీ కొత్త మేకోవర్ లో ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ లో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయ్ ఇప్పుడు బిజీగా ఉన్నాడని చెప్పాలి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


