వివాదంలో ఆర్.పి పట్నాయక్ సంగీతం

rp-patnayak
సంగీత దర్శకుడిగా ఆర్.పి పట్నాయక్ ఒకకాలంలో ఊపు ఊపేసాడు. యావత్ యువత అతని పాటలతోనే రోజంతా గడిపేది అంటే ఆశ్చర్యం కాదు. అలాంటి ఆర్.పి పట్నాయక్ సడన్ గా ఫేడ్ అవుట్ అయిపోవడం బాధాకరం. గతకొంతకాలంగా దర్శకత్వ శాఖపై దృష్టిపెట్టిన పట్నాయక్ బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్ సినిమాలు తీసినా అవి ఆశించిన విజయాలు సాధించలేదు.

అయితే పట్టు వదలని పట్నాయక్ ప్రస్తుతం ఒక హర్రర్ మూవీతో మనముందుకు రానున్నాడు. తులసీదళం అనే టైటిల్ ని ఖరారు చేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సంగీతం విడుదలకాకముందే ఒక ప్రముఖ ఛానల్ ధారావాహికలో వాడుకున్నారని ఆర్.పి మండిపడ్డాడు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.

Exit mobile version