
మాస్ మహారాజ్ కిక్ తరహాలోనే ‘కిక్ 2’తో అందరినీ మెప్పిస్తాడు అనుకున్నారు, కానీ కిక్ 2 సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత రవితేజ చేసిన తన మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకొని డిసెంబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్దమైంది. ఈ మధ్య టాలీవుడ్ లో కూడా బాలీవుడ్ లో లానే ప్రమోషన్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టారు, అలాగే ఆ ప్రమోషన్స్ వాళ్ళ సినిమాకి ఎంత మేలు కలుగుతోంది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు.
ఈ కారణంగా రవితేజ కూడా బెంగాల్ టైగర్ కోసం ఓపెన్ గా బయటకి వచ్చి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇప్పటి వరకూ రవితేజ్ ప్రమోషనల్ పరంగా బయట కనిపించింది చల తక్కువ, ఎక్కువగా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ తన పని తాను చేసుకొని పోతుంటాడు. కానీ ఈ సారి అలా ఉండకూడదని డిసైడ్ అయిన రవితేజ బయటకి వచ్చి భారీగా ప్రమోషన్స్ చేయడానికి ఒక ప్లాన్ సి సిద్దం చేస్తున్నాడట. రవితేజ సరసన హాట్ బ్యూటీస్ తమన్నా, రాశీ ఖన్నాలు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బొమన్ ఇరానీ విలన్ గా కనిపించనున్నాడు. రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు.

