లెజెండ్ క్రికెటర్స్ తో “RRR” నటుడు స్పెషల్ ట్రీట్

లెజెండ్ క్రికెటర్స్ తో “RRR” నటుడు స్పెషల్ ట్రీట్

Published on Feb 20, 2024 2:44 PM IST

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” లో మన టాలీవుడ్ నుంచి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో పాటుగా బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ లాంటో బిగ్ స్టార్ కూడా నటించిన సంగతి తెలిసిందే. మరి అజయ్ లేటెస్ట్ గా అయితే ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ని చేసాడు.

తాను ఇప్పుడు వరకు ఎన్నో చోట్ల ఇన్వెస్ట్మెంట్ చాలా ఇష్టంతో చేసానని అలా ఈసారి తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ సంబంధించి వరల్డ్ క్రికెట్ లెజెండ్స్ అందరికీ ఒకే దగ్గర చూసేలా “వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్” ని ప్రెజెంట్ చేస్తున్నాను అని క్రికెట్ లవర్స్ వింటేజ్ ట్రీట్ ఇచ్చేందుకు తాను సిద్ధం అయ్యారు. అయితే ఈ ఛాంపియన్ షిప్ లో ప్రపంచ వ్యాప్తంగా 6 దేశాలు పాల్గొంటున్నాయి.

మరి వీటిలో ఇండియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సహా వెస్ట్ ఇండీస్ కి చెందిన టీం లు తమ లెజెండరీ క్రికెటర్స్ కలయికలో తలపడనున్నాయి. మరి మరి అజయ్ దేవగన్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్, సురేష్, రైనా, హర్భజన్ సింగ్, బ్రెట్ లీ, కెవిన్ పీటర్సన్ అలాగే షాహిద్ అఫ్రిది లాంటి నా ఫేవరెట్ స్టార్స్ ని మరోసారి ఒకరితో ఒకరు తలపడడం చూడొచ్చని తెలిపాడు. దీనితో ఈ అనౌన్సమెంట్ క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు