RRR : ఎన్టీఆర్ పవర్ఫుల్ ఇంట్రో సీన్ పై కెమెరా మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

RRR : ఎన్టీఆర్ పవర్ఫుల్ ఇంట్రో సీన్ పై కెమెరా మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 18, 2024 8:08 PM IST

గ్లోబల్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా తమ తమ పాత్రల్లో అదరగొట్టారు.

ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ పవర్ఫుల్ ఇంట్రో సీన్ ఎప్పటికీ మరచిపోలేము. ముఖ్యంగా పులితో పోరాడే సీన్స్ మరింత హైలైట్. ఈ సీన్ గురించి కెమెరా మ్యాన్ సెంథిల్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, ఆ సీన్ తీస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు షాట్ రెడీ అనగానే ఎంతో వేగంగా పరిగెత్తడం చూసి యూనిట్ మొత్తం షాక్ అయిందన్నారు.

ముఖ్యంగా ఆ సీన్ లో వచ్చే తోడేలు, పులి కంటే కూడా ఆయన మరింత వేగంగా పరిగెత్తారని అన్నారు. అంత స్పీడ్ గా ఎలా పరిగెత్తగలరు అని అడుగగా, నేను గతంలో జూనియర్స్ విభాగంలో నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఆడానని, అందుకే ఎప్పుడూ ఫిట్ గా ఉండేలా చూసుకుంటానని ఎన్టీఆర్ చెప్పడం విని ఆశ్చర్యం పోయాం అని అన్నారు. మొత్తంగా ఒక పాత్ర కోసం ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని చెప్పుకొచ్చారు సెంథిల్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు