హీటెక్కిస్తున్న “RRR” లీక్స్.!

Published on Mar 4, 2021 8:00 am IST

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ కు చెందిన ముఖ్య భారీ సినిమాలు అన్నిటి నుంచి కూడా ఏవోక లీక్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ఉద్దేశ్య పూర్వకంగా వస్తున్నాయా లేక పొరపాట్ల మూలానో ఏమో కానీ అవి రావడమే సెన్సేషన్ ను సృష్టిస్తున్నాయి. మరి ఇలా లీక్స్ కు గురి కాబడ్డ చిత్రాల్లో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యూన్గ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ మహా యాగం నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో లీక్స్ బయటకు వచ్చేసాయి. అలా లేటెస్ట్ గా మరో లీక్ వచ్చింది. ఈసారి సినిమాలోని కొన్ని షాట్స్ వచ్చేసాయి.

చరణ్ మరియు ఎన్టీఆర్ లతో పాటుగా ఒలీవియా పైన కూడా ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇవి చూసిన ఫ్యాన్స్ మాత్రం హీటెక్కిపోతున్నారనే చెప్పాలి. ఆ రేంజ్ లో ఇందులో సీక్వెన్స్ కనిపిస్తున్నాయి. దీనితో రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ ఒకసారి తన మాస్ ఊహించని స్థాయిలో చూపించడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :