‘RRR’ నటుడు “మైదాన్” కి డిజప్పాయింటింగ్ ఓపెనింగ్స్

‘RRR’ నటుడు “మైదాన్” కి డిజప్పాయింటింగ్ ఓపెనింగ్స్

Published on Apr 12, 2024 9:04 PM IST

గ్లోబల్ హిట్ “రౌద్రం రణం రుధిరం” సినిమా నటుడు బాలీవుడ్ స్టార్ పర్సనాలిటీ అజయ్ దేవగన్ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రమే “మైదాన్”. మరి స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రం నార్మల్ ప్రీమియర్స్ తోనే సూపర్ మౌత్ టాక్ ని తెచ్చుకుంది. దీనితో ఈ ఈద్ హాలిడే కి పైగా దీనికి ముందు అజయ్ దేవగన్ నటించిన చిత్రం “సైతాన్” కూడా హిట్ కావడంతో థియేటర్స్ లోకి వచ్చే మైదాన్ సినిమా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అంతా అనుకున్నారు.

కానీ అనూహ్యంగా ఈ చిత్రం కేవలం 7.25 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే ఇండియాలో అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా కేవలం 10.7 కోట్ల గ్రాస్ (Maidaan Openings) ని మాత్రమే అందుకుంది. ఇది మాత్రం చాలా డిజప్పాయింటింగ్ అంశం అని చెప్పక తప్పదు. టాక్ అంతా సూపర్ పాజిటివ్ ఉన్నప్పటికీ సినిమా చూసేందుకు ఇంకా ప్రేక్షకులు తరలి రావడం లేదు. అయితే ఈ వారాంతానికి మాత్రం సినిమా డెఫినెట్ గా పికప్ అవ్వొచ్చని వినిపిస్తుంది. మరి చూడాలి హిందీ ప్రేక్షకులు ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారు అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు