‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎన్టీఆర్ ?

‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎన్టీఆర్ ?

Published on Sep 4, 2019 2:00 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం తార‌క్ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నార‌ట‌. ఇప్పటికే నాలుగు భాష‌లను ఎన్టీఆర్ నేర్చుకుంటున్నాడట. కాగా రాజమౌలి ఈ సినిమా తరువాత షెడ్యూల్ ను బల్గేరియాలో చేయబోతున్నాడట. ఇప్పటికే తన చిత్రబృందంతో 3 వారాల పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్ కోసం బల్గేరియాలో షూట్ ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు