నార్త్ లో “ఇండియన్ 2” హక్కులు సొంతం చేసుకున్న “RRR” డిస్ట్రిబ్యూటర్

నార్త్ లో “ఇండియన్ 2” హక్కులు సొంతం చేసుకున్న “RRR” డిస్ట్రిబ్యూటర్

Published on May 24, 2024 4:00 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2”. మరి రెండున్నర దశాబ్దాల కాలం కితం వచ్చిన ఇండియన్ కి కొనసాగింపుగా వస్తున్నా ఈ సినిమాపై ఇప్పుడిప్పుడే మంచి బజ్ బిల్డప్ అవుతూ వస్తుంది.

అలాగే రీసెంట్ గా వచ్చినా ఫస్ట్ సింగిల్ కి కూడా అనూహ్య స్పందన వస్తుండడం గమనార్హం. ఇక ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా తాలూకా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి డీటెయిల్స్ అందిస్తున్నారు. లేటెస్ట్ గా నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఎవరో మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సెన్సేషన్ “RRR” ని హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ సంస్థ పెన్ స్టూడియోస్ వారు వారి ద్వారా భారీ రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

మరి హిందీలో ఈ సినిమా “హిందుస్తానీ 2” గా రిలీజ్ కానుంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో అయితే నిర్మాణ సంస్థ లైకా వారు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వారు కలిసి రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక మిగతా భాషలు సంబంధించి అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఈ జూలై 12న రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు