మళ్ళీ “RRR” అప్డేట్ అప్పుడే అని ఫిక్స్ అయ్యారు.!

Published on Feb 25, 2021 8:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను ఇస్తూనే వస్తున్నారు. అయితే అది షూటింగ్ పైన అయినా కానీ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కానీ వదులుతున్నారు.

అయితే ఈ మధ్య మధ్య కాలంలోనే కొన్ని అప్డేట్స్ ను ఇచ్చిన చిత్ర యూనిట్ నుంచి మళ్ళీ అప్డేట్ ఎప్పుడు అన్నది ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో తారక్ చేస్తున్న భీం రోల్ కు ఫీమేల్ లీడ్ గా చేసిన ఒలీవియా మోరిస్ ఫస్ట్ లుక్ అప్డేట్ ను ఆమె పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేశారు.

చరణ్ చేస్తున్న సీతారామరాజు రోల్ కు సంబంధించి ఫీమేల్ లీడ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పై అప్డేట్ వచ్చే మార్చ్ 15న ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారని అభిమానులే ప్రిడిక్షన్ వేసుకుంటున్నారు. మరి అప్పుడు ఆ అప్డేట్ వచ్చినపుడు ఈసారి ఈమెపై రాదు అని చెప్పడానికి లేదు, మరి నిజంగా ఆరోజున అప్డేట్ ఉంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :