రాజమౌళి ఈ వారమే మొదలెట్టనున్నాడు !

Published on Jun 1, 2020 3:37 pm IST

ఈ నెల 15 నుండి పరిమిత సిబ్బందితో చిత్రీకరణ ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ముందుగానే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం పరిమిత సభ్యులతో ఈ వారంలోనే షూట్ ను స్టార్ట్ కానుంది. రాజమౌళి ఇప్పటికే షూటింగ్ కోసం ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించారట.

నిర్మాత డివివి దానయ్య సెట్స్‌ పై కఠినమైన చర్యలు పాటించేలా చూసుకోనున్నారు. పైగా షూట్ కూడా ఎక్కువగా ఇంట్లోనే జరుగుతుంది. అది కూడా టాకీ పార్ట్స్ మాత్రమే. మరి రాబోయే రోజుల్లో షూట్ ఎలా కొనసాగుతుందో చూడాలి.

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More