రాజమౌళి ఇక గ్యాప్ ఇవ్వడట !

రాజమౌళి ఇక గ్యాప్ ఇవ్వడట !

Published on Jul 26, 2019 10:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. అయితే చరణ్ అండ్ ఎన్టీఆర్ లకు గాయాలు అవ్వడం కారణంగా, అనుకున్న తేదీల ప్రకారం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి కాలేదు. దాంతో రాజమౌళి ఇప్పుడు చెయ్యబోయే షెడ్యూల్స్ ను గ్యాప్ లేకుండా వరుసగా షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చమటోడుస్తున్నాడు. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు చేస్తున్నాడు.

కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు