‘RRR’ షూట్ యథావిధిగా..లేటెస్ట్ అప్డేట్ ఇదే!

‘RRR’ షూట్ యథావిధిగా..లేటెస్ట్ అప్డేట్ ఇదే!

Published on Mar 19, 2021 7:04 AM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఇప్పుడు శరవేగంగా షూట్ ను కంప్లీట్ చేసుకుంటుంది. అయితే గత కొన్ని రోజుల కితం చరణ్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పై సాంగ్ ను తీయనున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ మధ్యలో ఆలియా నుంచి కరోనా సెగ తగలడంతో కాస్త కంగారు మొదలయ్యింది. కానీ మళ్ళీ అదేం లేదు అని తేలడంతో ప్లాన్ ప్రకారం వచ్చే వారం షూట్ కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి ఈ అప్డేట్ ప్రకారం యథావిధిగా వేసిన భారీ సెట్స్ లో పాటతో పాటుగా వారిద్దరి నడుమ కొన్ని కీలక సన్నివేశాలను కూడా రాజమౌళి తెరకెక్కించనున్నట్టు టాక్. ఇక ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మోస్ట్ అవైటెడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు