‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ డిటైల్స్ !

‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ డిటైల్స్ !

Published on Sep 15, 2020 1:06 AM IST

రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా నవంబర్ లో ప్లాన్ చేస్తోన్న తదుపరి షెడ్యుల్ లో ఒలివియా మోరిస్ అండ్ ఎన్టీఆర్ కు మధ్య నడిచే సీన్స్ ను షూట్ చేయనున్నారట. ఎన్టీఆర్ మీద ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేయడానికి ఈ సీన్స్ లోని కొన్ని షాట్స్ అవసరం అవుతాయట. అందుకే ముందుగా ఈ సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రేమ కోసం ఒలివియా తమ దేశం పైన, తన తల్లిదండ్రుల పైనే పోరాడుతుందట. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ప్రాణాలు ఇస్తుందని.. ఎన్టీఆర్ – ఒలివియా ట్రాక్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు