ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ !

Published on Feb 7, 2019 2:16 pm IST

ఎన్టీఆర్ -రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో చరణ్ తో పాటు 1000మంది పాల్గొంటుండగా యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈసినిమాలో తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు ఫై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. అయితే జక్కన మాత్రం బాలీవుడ్ కథానాయికలను తీసుకునే ఆలోచనలో వున్నాడట. వచ్చే ఏడాది లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదలకానుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :