“RRR” నుంచి పవర్ ఫుల్ అజయ్ దేవగణ్ వచ్చేసాడు.!

“RRR” నుంచి పవర్ ఫుల్ అజయ్ దేవగణ్ వచ్చేసాడు.!

Published on Apr 2, 2021 2:00 PM IST

బాహుబలి తర్వాత తెలుగు నుంచి అంతకు మించిన స్థాయిలో సెన్సేషన్ కు నమోదు చెయ్యడానికి సిద్దమవుతున్న మరో భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఒక్కో అప్డేట్ తో భారీ హైప్ ను మూటగట్టుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు మరో మోస్ట్ అవైటెడ్ అప్డేట్ రివీల్ అయ్యింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ చేస్తున్న పవర్ ఫుల్ రోల్ లుక్ మరియు మోషన్ పోస్టర్ తో మరింత హైప్ తీసుకొచ్చారు.

చుట్టూ తుపాకులు పట్టుకొని శత్రు సైన్యం కానీ మధ్యలో దృఢంగా ఒక్కడే నిలుచొని ఉన్నాడు. ఒక్కసారిగా తన ముసుగును తొలగించి గుండెలపై తుపాకీ గుల్ల కవచంతో తలకు పాగా, కీరవాణి మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఊహించని రేంజ్ లో ప్రెజెంట్ చేశారు. మొత్తానికి మాత్రం అజయ్ దేవగణ్ పుట్టినరోజుకు మాత్రం “RRR” ఇచ్చిన గిఫ్ట్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చింది. దీనిని బట్టి తారక్ మరియు చరణ్ ల పాత్రలు ఎంతైతే పవర్ ఫుల్ గా ఉన్నాయో అజయ్ పాత్ర కూడా ఆద్యంతం అంతే పవర్ ఫుల్ గా చూపించడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు