“RRR” సర్ప్రైజ్ జాతి రత్నాలను చూసారా.?

“RRR” సర్ప్రైజ్ జాతి రత్నాలను చూసారా.?

Published on Mar 11, 2021 10:03 PM IST

ఈ వారం శివరాత్రి కానుకగా మంచి హైప్ నడుమ విడుదల కాబడిన చిన్నపాట చిత్రాల్లో నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలు మరో కీలక పాత్రల్లో నటించిన “జాతి రత్నాలు” కూడా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా విడుదలకు ఎలాంటి హైప్ ను మేకర్స్ తెచుకున్నారో తెలిసిందే.సాలిడ్ ప్రమోషన్స్ తో అదరగొట్టిన సినిమా టీం కు టాలీవుడ్ పెద్దల నుంచి కూడా గట్టి బూస్టప్ దక్కింది.

అయితే ఈ చిట్టి టీం కు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అయినటువంటి “RRR” టీం ఒక సర్ప్రైజ్ ను ప్లాన్ చేశారు. ఈ జాతి రత్నాలు పోస్టర్ లో నవీన్, ప్రియదర్శి అలాగే రాహుల్ రామకృష్ణలు ఎలా అయితే ఖైదీలుగా కనిపించారో అలాగే రాజమౌళి చరణ్ మరియు తారక్ లతో ఒక ఫన్నీ అండ్ కార్టూన్ పోస్టర్ ను డిజైన్ చేసి వారికి తమ విషెస్ ను తెలియజేసారు. మొత్తానికి మాత్రం ఆ హిలేరియస్ టీం కు వీరి నుంచి ఇది ఒక హిలేరియస్ సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు