‘ఆర్ఆర్ఆర్’లో మరో సూపర్ స్టార్ !

Published on Mar 27, 2020 12:00 am IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ కూడా ఆ ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించారట.

ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇతర కీలక పాత్రల కోసం విదేశీ నటీనటుల్ని ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. మరో ప్రత్యేక పాత్రలో అజేయ్ దేవగణ్ ను తీసుకున్నారు.

మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More