‘ఆర్ఆర్ఆర్’కి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ !

‘ఆర్ఆర్ఆర్’కి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Feb 5, 2020 5:29 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ మారింది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. అయితే సినిమాని అద్భుతంగా తెరకెక్కిసున్నామని అందుకే విడుదల తేదీ మార్చాల్సి వచ్చిందని చిత్రబృందం వివరణ ఇచ్చింది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటిస్తోంది. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు