సోషల్ మీడియాలో సంచలంగా మారిన ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ లుక్.

సోషల్ మీడియాలో సంచలంగా మారిన ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ లుక్.

Published on Jul 7, 2019 1:03 AM IST

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ లో ఎన్టీఆర్ లుక్ ఊహిస్తూ ఓ అభిమాని క్రియేట్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.కోర మీసం,కొద్దిగా పెరిగిన గడ్డం,తలకు ఎర్రని పాగా ధరించి తీక్షణంగా చూస్తున్నట్లున్న ఎన్టీఆర్ లుక్ ఒరిజినల్ లుక్ అని భ్రమింపజేసేలా ఉంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ లైక్స్, షేర్స్ తో ప్రభంజనం రేపుతోంది.

దర్శకుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” మూవీకి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు