‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 15, 2019 4:58 pm IST

జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈ నెల 21న హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో చెయ్యబోయే సన్నివేశాల్లో ఎన్టీఆర్ రఫ్ లుక్ లో కనిపిస్తాడట.

ఇక ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :