
‘రుద్రమదేవి’, ‘బ్రూస్ లీ’.. ఈ దసరా సీజన్‌కు భారీ క్రేజ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ఫిక్స్ అయిన రెండు పెద్ద సినిమాలు. దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘రుద్రమదేవి’ ఇప్పటికే విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే, ఇక మరో రెండు రోజుల్లో రామ్ చరణ్-శ్రీనువైట్లల కాంబినేషన్‌లో రూపొందిన ‘బ్రూస్ లీ’ సందడి మొదలుకానుంది. రెండు భారీ సినిమాలు ఇలా ఒకేవారం తేడాలో విడుదల కావడం రెండు సినిమాలకూ మంచిది కాదన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమైనా, ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడి ఒక రిలీజ్ డేట్‌కు ఫిక్స్ అయిన ‘రుద్రమదేవి’, సెట్స్‌పైకి వెళ్ళినరోజే అక్టోబర్ 16కు ఫిక్స్ అయిన ‘బ్రూస్ లీ’.. ఇలా రెండు సినిమాలూ వాయిదా పడే అవకాశం లేకపోవడంతో వారం తేడాలోనే థియేటర్లను పంచుకుంటున్నాయి.
ఇక ఇదే విషయమై ఇండస్ట్రీలో గత రెండు రోజులుగా తీవ్ర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు ‘రుద్రమదేవి’ టీమ్, అటు ‘బ్రూస్ లీ’ టీమ్ ఈ విషయమై సరైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి. ‘రుద్రమదేవి’ సినిమాలోనూ ఓ మెగా హీరో నటించడం, మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం వంటి విషయాల వల్ల ఇరు చిత్రాల టీమ్స్ ఇచ్చిన క్లారిటీలతో ‘రుద్రమదేవి’, ‘బ్రూస్ లీ’లపై జరుగుతూన్న చర్చలకు తెరపడింది. ఇక అదేవిధంగా ‘రుద్రమదేవి’ టీమ్ ‘బ్రూస్ లీ’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పడం ఇక్కడ విశేషంగా కనిపిస్తోంది. “దశాబ్దం తర్వాత రుద్రమదేవిలో చిరంజీవి వాయిస్ ఓవర్‌కే ఇంత రెస్పాన్స్ వస్తే ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు” అంటూ బ్రూస్ లీ టీమ్‌కు గుణశేఖర్, ‘రుద్రమదేవి’ టీమ్ తరపున ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక పండగ సీజన్‌లో రెండు సినిమాలూ బాగా ఆడాలని ఈ రెండు సినిమాల దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.