అనుష్క ‘రుద్రమదేవి’కి కన్నడలో బంపర్ ప్రైజ్

అనుష్క ‘రుద్రమదేవి’కి కన్నడలో బంపర్ ప్రైజ్

Published on Aug 18, 2015 3:55 PM IST

Rudhramadevi
టాలీవుడ్ లో పీరియాడికల్ ఫిల్మ్స్ వచ్చి చాలా కాలం అయ్యిందనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఒకే సమయంలో టాలీవుడ్ లో సెట్స్ పైకి వెళ్ళిన రెండు పీరియాడికల్ ఫిల్మ్స్ ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’. బాహుబలి సినిమా నెల రోజుల క్రితం రిలీజ్ అయ్యి అందరినీ మెప్పించి, బాక్స్ ఆఫీసు రికార్డ్స్ బద్దలు కొట్టడంతో ఇప్పుడు అందరి చూపు ‘రుద్రమదేవి’ పైనే ఉంది. ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమానే ఇది. ఇండియన్ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీగా వస్తున్న ‘రుద్రమదేవి’కి భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ డైరెక్టర్.

బాహుబలి సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లోనూ పెద్ద హిట్ అయ్యింది. అందుకే ఈ సినిమాని కూడా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే ఈ సినిమాకి బిజినెస్ అవుతోంది. తమిళం తర్వాత కన్నడలో కూడా రుద్రమదేవి హక్కులకి మంచి క్రేజ్ నెలకొంది. పలువురు డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య గట్టిగా పోటీ జరిగింది. మాకు అందిన సమాచారం ప్రకారం రుద్రమదేవి కర్ణాటక రైట్స్ ని సుమారు 3.75 కోట్లకి అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా టైటిల్ రోల్ లో అనుష్క కనిపించనుంది.

తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం మరో స్పెషల్ అట్రాక్షన్. ఒకేసారి తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు