రుద్రమదేవి సెన్సార్, రన్‌టైమ్ డీటైల్స్!

రుద్రమదేవి సెన్సార్, రన్‌టైమ్ డీటైల్స్!

Published on Sep 26, 2015 11:49 AM IST

Rudhramadevi
తెలుగులో ఈమధ్య కాలంలో ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూయించిన సినిమాల్లో ‘రుద్రమదేవి’ మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినా కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా, అంచనాలు మరింత పెరగడం విశేషంగా కనిపిస్తోంది. గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన ‘రుద్రమదేవి’ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చి చివరకు అక్టోబర్ 9వ తేదీకి ఫిక్స్ అయింది. భారతదేశపు మొట్టమొదటి ౩డీ బయోపిక్‌గా తెరకెక్కిన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ వర్షన్స్‌లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ఊ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2 గంటల 38 నిమిషాల నిడివిగల ఈ సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడిదంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో గుణశేఖర్ సినిమా అనుకున్న విధంగానే అక్టోబర్ 9న విడుదల కానుందని స్పష్టం చేశారు. అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు.. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే విజువల్ ఫీస్ట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు