ప్రస్తుతం మన సౌత్ సినిమా దగ్గర రాణిస్తున్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో కాంతార లేటెస్ట్ గా ఎన్టీఆర్ డ్రాగన్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా ఒకరు. అయితే రుక్మిణిపై కొన్ని షాకింగ్ వీడియో విజువల్స్ ఇంకా ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం మొదలయ్యాయి.
అయితే ఈ విజువల్స్ పై ఫైనల్ గా రుక్మిణి వసంత్ అందరికీ ఓ అధికారిక క్లారిటీ ప్రెస్ నోట్ ద్వారా ఆ ఫోటోలు విషయం తన దృష్టికి వచ్చింది అని అవి పూర్తిగా ఫేక్ ఫోటోలు అని ఆమె తేల్చేసింది. అంతే కాకుండా తన ప్రైవసీకి భంగం కలిగించిన వారి పట్ల సీరియస్ యాక్షన్ తీసుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చింది.
ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకుని సైబర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని ఆమె తెలిపింది. అలాగే దయచేసి ఆ కంటెంట్ ని ఎవరు షేర్ చెయ్యొద్దు అని ఆమె రిక్వెస్ట్ చేసింది. మరి అసలు వీటిని ఎవరు సృష్టించారో వాళ్ళని పోలీసులు పట్టుకుంటారో లేదో చూడాలి.



