ఇంకా కేవలం కొద్దిరోజులలో బాలయ్య రూలర్ గా థియేటర్లలో దిగనున్నాడు. క్రిస్మస్ కానుకగా వచ్చేనెల 20న రూలర్ మూవీ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఈఇటీవల రూలర్ టీజర్ విడుదల చేయగా ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. పోలీస్ మరియు మరో స్టైలిష్ గెటప్ లో బాలయ్య భీకరంగా శత్రువులపై విరుచుకుపడ్డాడు. ఇక త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేయనున్న చిత్ర యూనిట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిపే ఏర్పాట్లలో ఉన్నారట.
హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 15న రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని చూస్తున్నారని సమాచారం. గతంలో జై సింహ వంటి చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించిన కేఎస్ రవికుమార్ రూలర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక బాలయ్యకు జంటగా నటిస్తున్నారు. కాగా రూలర్ సినిమాకి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.


