బాలయ్య రూలర్ తో మొదటిరోజు బాగానే రాబట్టాడు.

Ruler review

నందమూరి నట సింహం బాలయ్య లేటెస్ట్ మూవీ రూలర్ నిన్నప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఐతే రూలర్ మొదటి షో నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా రూలర్ భేష్ అనిపించాడు. మొదటిరోజు రూలర్ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 4.29 కోట్ల షేర్ రాబట్టాడు. మాస్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ బి, సి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

సీనియర్ దర్శకుడు కె ఎస్ రవి కుమార్ రూలర్ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జై సింహ హిట్ టాక్ తెచ్చుకుంది. హ్యాపీ మూవీస్ పతాకంపై నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించగా చిరంతన్ భట్ సంగీతం అందించారు.

ఏరియాల వారీగా రూలర్ కలెక్షన్స్…
నైజాం :0.68 కోట్లు
సీడెడ్: 1.08 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.28 కోట్లు
ఈస్ట్: 0 27 కోట్లు
వెస్ట్: 0.26 కోట్లు
గుంటూరు: 1.30 కోట్లు
కృష్ణ: 0.20కోట్లు
నెల్లూరు: 0.22కోట్లు
మొత్తం ఆంధ్రా మరియు తెలంగాణాలో కలిపి: 4.29 కోట్లు

Exit mobile version