ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ‘రూల్స్ రంజన్’

ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ‘రూల్స్ రంజన్’

Published on Dec 9, 2023 3:00 AM IST


యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్స్ గా రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్ మూవీ రూల్స్ రంజన్. ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించే విజయాన్ని మాత్రమే అందుకుంది. అనంతరం తాజాగా ప్రముఖ ఒటిటి మాధ్యమాలు అమెజాన్ ప్రైమ్, ఆహా లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం మంచి రెస్పాన్స్ తో కొనసాగుతోంది.

ఇక ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, ఆహాలో 72 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ అవుతూ, మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. మొత్తంగా రూల్స్ రంజన్ ఓటిటి లో మంచి రెస్పాన్స్ అందుకుంటుండడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బరాజు, హర్ష చెముడు, హైపర్ ఆది కీలకపాత్రలు పోషించిన ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో స్టార్‌ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు