మహేష్ సినిమాకి జక్కన్న ఈ ప్లానింగ్ కానీ నిజమైతే..

మహేష్ సినిమాకి జక్కన్న ఈ ప్లానింగ్ కానీ నిజమైతే..

Published on Feb 25, 2024 8:47 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గుంటూరు కారం” ఇప్పుడు ఓటిటిలో అదరగొడుతుండగా ఈ చిత్రం తర్వాత అవైటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ దర్శకుడు రాజమౌళితో అయితే మహేష్ బాబు తన కెరీర్ లో 29వ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా పనులే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చేస్తుండగా RRR గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్నా చిత్రం ఇది కావడంతో ప్రపంచ సినిమా చూపు కూడా ఈ సినిమా మీద ఉంది.

మరి ఈ హైప్ కి తగ్గట్టుగానే రాజమౌళి తన మార్క్ మార్కెటింగ్ ఈ చిత్రానికి చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి దీని ప్రకారం రాజమౌళి గత చిత్రాల్లానే సినిమా అనౌన్స్ చేసిన తర్వాత మీడియాతో తన సినిమా కోసం ఓ ప్రెస్ మీట్ ని పెడతారని తెలిసిందే. అయితే ఇప్పుడు ఉన్న గ్లోబల్ ఫేమ్ లో జక్కన్న మహేష్ సినిమా కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెస్ మీడియాతో కలిసి సినిమా అనౌన్సమెంట్ చేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది పక్కన పెడితే ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం ఖచ్చితంగా సినిమాకి బిగ్ ప్లస్ అండ్ వరల్డ్ ఆడియెన్స్ లో కూడా ఈ చిత్రానికి ఒక స్పెషల్ అటెన్షన్ వచ్చినట్టు ఉంటుంది అని చెప్పాలి. జక్కన్న తన సినిమాని ఏ లెవెల్లో ప్రమోట్ చేస్తారో తెలిసిందే. మరు రూమర్ నిజం అయ్యినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. మరి దీనికి సమాధానం కాలమే అందించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు