పవన్, చరణ్ సెన్సేషనల్ కాంబోపై ఆగని రూమర్స్.!

పవన్, చరణ్ సెన్సేషనల్ కాంబోపై ఆగని రూమర్స్.!

Published on Jan 19, 2021 3:03 PM IST

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే కొన్ని కాంబినేషన్ లు అంటే జస్ట్ టాక్ తోనే ఎక్కడా లేని భారీ స్థాయి అంచనాలు ఏర్పడిపోతాయి. మరి అలాంటి ఓ సంచలన కాంబినేషన్ కోసమే మన తెలుగు ఇండస్ట్రీ మరియు పాన్ ఇండియన్ సినిమాలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ ల కాంబో నుంచి ఓ సినిమా ఉండనుంది అన్న టాక్ ఒక్కసారిగా వేరే లెవెల్ అంచనాలు సెట్ చేసాయి.

దీనితో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యిన ఈ కాంబో జాతీయ స్థాయిలో కూడా రచ్చ లేపుతుంది. మరి ఈ కాంబో ఉందో లేదో కానీ రూమర్స్ మాత్రం ఒక్కసారిగా విపరీతంగా వ్యాపించాయి. అయితే ఒకవేళ పరిస్థితులు అనుకూలించి ఈ కాంబినేషన్ సెట్టయితే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త లెక్కలు లిఖించడం ఖాయమనే చెప్పాలి. కానీ అందుకు అవకాశాలు మాత్రం దాదాపు లేనట్టే అని చెప్పాలి. మరి దీనిపై కాలమే సమాధానం చెప్తుందేమో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు