విశాల్ పెళ్లి పై పుకార్లు…!

Published on Aug 22, 2019 10:03 pm IST

నటుడు విశాల్ పెళ్లిపై షాకింగ్ వార్త ఒకటి బయటకు రావడం జరిగింది. విశాల్, అనీషా మనస్పర్థల కారణంగా విడిపోయారని, వీరిపెళ్లి ఇక జరగనట్లే అని అనేక మాధ్యమాల్లో ప్రముఖంగా ప్రచురించిన వార్త. అనీషా విశాల్ కొద్దినెలల క్రితం ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. వీరి పెళ్లి ఇంకా నెల రెండు నెలలో కానుందన్న తరుణంలో ఇలాంటి వార్త ఆయన అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది.

ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందన్న సంగతి తెలియదు.ఐతే ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరు స్పందించకపోవడం గమనార్హం. ప్రస్తుతం విశాల్ సి సుందర్ దర్శకత్వంలో యాక్షన్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :