ఫౌజీ కాదు.. స్పిరిట్ నే ముందుకు తెస్తున్న ప్రభాస్..?

ఫౌజీ కాదు.. స్పిరిట్ నే ముందుకు తెస్తున్న ప్రభాస్..?

Published on Sep 29, 2026 12:23 AM IST

Spirit

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల విడుదల క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని మొదట డిసెంబర్ 3న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, తొందరపడకుండా సరైన ప్లానింగ్‌తో రావాలని ప్రభాస్ నిర్మాతులకు సూచించడంతో ఈ సినిమా వాయిదా పడింది. డిసెంబర్ రేసు నుంచి ఫౌజీ తప్పుకోవడంతో, మేకర్స్‌కి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయడానికి సరిపడా సమయం లభించింది.

​ఈ మార్పుతో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ చిత్రమే ప్రభాస్ తర్వాతి విడుదలగా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ‘స్పిరిట్’ సినిమాను మార్చి 5, 2027న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఖరారయ్యే వరకు ‘స్పిరిట్’ ముందే వస్తుందనే వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు