లివర్ ట్రీట్మెంట్ కోసం అమితాబ్ ఆసుపత్రిలో చేరడం నిజమేనా ?

Amitabh Bachchan

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం గురించి ఉదయం నుండి పలు వార్తలు వెలువడుతున్నాయి. బచ్చన్ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, మంగళవారం నాడే ఆయన నానావతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, ట్రీట్మెంట్ జరుగుతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలోనే అమితాబ్ లివర్ సమస్యను ఫేస్ చేసి ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

మరోవైపు ఆయన ఆసుపత్రికి వెళ్లింది లివర్
సమస్య వలన కాదని, కేవలం జనరల్ చెకప్ కోసమేననే ప్రచారం కూడా నడుస్తోంది. పైగా ఈ వార్తల పట్ల అమితాబ్ లేదా ఆయన పర్సనల్ సిబ్బంది ఎవరూ ఇంతవరకు స్పందించలేదు.
దీంతో ఏ వార్తల్ని నమ్మాలో తెలియక అభిమానులు, సినీ ప్రేక్షకులు కంగారుపడుతూ ఏది ఏమైనా తమ అభిమాన నటుడి ఆరోగ్యం బాగుండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికైనా బచ్చన్ ఫ్యామిలీ ఈ వార్తల పట్ల రెస్పాండ్ అయితే మంచిది.

Exit mobile version