రానా సినిమా వాయిదాపడనుందా ?

Published on Mar 9, 2020 8:38 pm IST

రానా చేస్తున్న సినిమాల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్న చిత్రం ‘హాతి మేరే సాతి’. ఏనుగుల నేపథ్యంలో సాగే రియలిస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రభు సాలమన్ డైరెక్ట్ చేశారు. తెలుగులో ఈ చిత్రం ‘అరణ్య’ పేరుతో విడుదలకానుంది. ముందుగా ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు టీమ్ ప్రకటించారు. కానీ తాజాగా సినిమా వాయిదాపడే అవకాశాలున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో మార్చ్ నెల చివరికి ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పూర్టవ్వాలి. కానీ ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదాపడేలా ఉన్నాయి. అందుకే చిత్రాన్ని ఏప్రిల్ 2 నుండి 24కు మార్చే అవకాశాలున్నాయని టాక్. ఇప్పటివరకు ఈ వార్తపై ఎలాంటి అధికారిక క్కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి చిత్ర టీమ్ స్పందించి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం తెలుగు, హిందీలతో పాటు తమిళంలో కూడా విడుదలకానుంది. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది.

సంబంధిత సమాచారం :

More