“కల్కి 2898ఎడి” టీజర్ రన్ టైం లాక్డ్.?

“కల్కి 2898ఎడి” టీజర్ రన్ టైం లాక్డ్.?

Published on Feb 23, 2024 12:11 PM IST

Kalki 2898 AD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని దీపికా పదుకోణ్ లు హీరోయిన్ గా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ లాంటి భారీ స్టార్స్ తో నటిస్తున్న పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం “కల్కి 2898ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ సహా ప్రపంచ ఆడియెన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర టీజర్ వస్తుంది అని ఈ మధ్య వాజ్ వచ్చింది.

మరి ఈ టీజర్ కి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ టీజర్ 1 నిమిషం 23 సెకండ్స్ కి గాను మేకర్స్ కట్ చేశారట. మరి ఇప్పుడు అని పనులు శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా టీజర్ రిలీజ్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మే 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు